కావ్య-అనిరుధ్ వివాహ రిసెప్షన్.. చంద్రబాబు, లోకేశ్ లను ఆహ్వానించిన మారన్ దంపతులు
Advertisement
- ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ భేటీ
- కుమార్తె కావ్య-అనిరుధ్ వివాహ రిసెప్షన్కు రావాల్సిందిగా ఆహ్వానం
- మంత్రి నారా లోకేశ్ ను కూడా కలిసి ఆహ్వాన పత్రిక అందజేత
- నవంబరు 21న చెన్నైలో రిసెప్షన్
- వివాహం నవంబరు 11న గ్రీస్ లో జరుగుతుందంటూ ప్రచారం
Advertisement
ప్రముఖ పారిశ్రామికవేత్త, సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ తన అర్ధాంగి కావేరి కళానిధితో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమ కుమార్తె కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ల వివాహ రిసెప్షన్కు హాజరు కావాల్సిందిగా వారు ముఖ్యమంత్రిని సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చెన్నైలో నవంబరు 21న జరగనున్న వివాహ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను కళానిధి మారన్ దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయంగా అందజేశారు. ఈ భేటీ ఆద్యంతం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.
అనంతరం, కళానిధి మారన్ దంపతులు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ను కూడా కలిశారు. ఆయనకు కూడా తమ కుమార్తె వివాహ రిసెప్షన్ ఆహ్వాన పత్రికను అందించి, వేడుకకు రావాల్సిందిగా కోరారు. రాజకీయ, వ్యాపార రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల మధ్య ఈ ఆత్మీయ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, అనిరుధ్-కావ్యాల వివాహం నవంబరు 11న గ్రీస్ లో జరుగుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.